రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజ్

హైదరాబాద్, డిసెంబర్ 18 : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు (Dil Raju) బుధ‌వారం ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయ‌న బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ డాక్ట‌ర్‌ హరీష్ దిల్ రాజు (Dil Raj)ను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై దిల్ రాజ్‌ను అభినందించారు. అనంతరం, తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చెందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన షూటింగ్స్ తెలంగాణలో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని, తెలంగాణకు చెందిన సినిమాల ప్రోత్సాహానికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. అదేవిధంగా ఎగ్జిబిట‌ర్ల‌ సమస్యల పరిష్కారంతో పాటు, సినీ నిర్మాతలకు షూటింగ్ ల అనుమతులను సింగల్ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని దిల్ రాజ్ పేర్కొన్నారు.

చిత్ర పరిశ్రమకు అన్నివిధాలుగా అండగా ఉంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణలో చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చెందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వడంలో దిల్ రాజు సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దిల్ రాజు బుధవారం ఉదయం పదవీ బాధ్యతల స్వీకార కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page