ఇక తెలంగాణ డిజిటల్ కేబినెట్

– సీఎంకు, మంత్రులకు ట్యాబ్‌ల అందజేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : పేపర్ లెస్ గవర్నెన్స్‌లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్‌గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరికీ స్పెషల్ ట్యాబ్‌లను ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గురువారం అందజేశారు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ ట్యాబ్‌ల ద్వారానే మంత్రులకు కేబినెట్ సమావేశం ఎజెండా పంపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *