– రైతులు ఆర్థికంగా ఎదగాలి
– రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ సంకల్పం
– లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: రైతాంగాన్ని అదుకునేందుకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న మేలు రకాల సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. పేదలు కూడా సన్న బియ్యం తినాలి. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి అనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళుతోందన్నారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగు పై కేబినెట్ సబ్ కమిటి చర్చింది. ఈ సందర్భంగా రైతులకు లాభదాయకమైన వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆయా పంటలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. మేలుజాతి వంగడాలు సమృద్ధిగా ఉన్నాయని.. వీటిని సాగు చేస్తే రైతులకు ఆదాయం గణనీయంగా ఉంటుదని వ్యవసాయ కమిషన్ తెలిపింది. ప్రభుత్వం ఈ వంగడాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, గ్రామ గ్రామాన రైతులను చైతన్యపరచడానికి ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కమిషన్ తెలిపింది. రాబోయే సీజన్లలో ఈ రకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా అటు రైతులకు అదనపు ఆదాయం, ఇటు మార్కెట్ రంగానికి పూర్తి ప్రయోజనం చేకూరుతుందని, వరి సాగులో తెలంగాణ రాష్ట్రం మరింత లాభదాయకమైన దిశగా అడుగులు వేస్తుందని వ్యవసాయ కమిషన్ సైతం కేబినెట్ సబ్ కమిటీకి నివేదించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కొనుగోళ్ళకు తగ్గిస్తూ ఇబ్బంది పెడుతోందని వ్యవసాయ కమీషన్ తెలిపింది. అంతేకాక బాయిల్డ్ రైస్ ను ఏమాత్రం కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపింది. సమావేశంలో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాతీయ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





