సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : ప్రజలకు మరింత చేరువ కావాలంటే పోలీసు వ్యవస్థకు ప్రజల, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం.. ఈ ఆలోచనతోనే 2006 ఆగస్టు 23న సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజా భద్రతకు సంబంధించి అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కౌన్సిల్ సభ్యులకు, భాగస్వామ్య సంస్థలకు, గతంలో దీంతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ డీజీపీ సి.వి.ఆనంద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా, మరిన్ని వినూత్న కార్యక్రమాలతో ప్రజా భద్రతకు సేవలందించాలని ఆకాంక్షించారు. మహిళల భద్రత కోసం ‘షీ షటిల్స’, విద్యార్థుల భవిష్యత్తు, చదువుల కోసం ‘చైతన్య’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసింది. ‘తాను సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సెక్యూరిటీ కౌన్సిల్ కొంతవరకు నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉండేది.. దానికి జీవం పోసి ప్రజా భద్రతలో మరింత సమర్థవంతమైన భాగస్వామిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాను.. ఈ క్రమంలో పబ్లిక్-ప్రైవేట్ రంగాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసులతో కలిసి నిరంతరం పనిచేసేలా సెక్యూరిటీ కౌన్సిల్‌ను బలోపేతం చేశాం.. నేడు సైబరాబాద్‌లో సెక్యూరిటీ కౌన్సిల్ సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజా భద్రతలో పోలీసుల పాత్రను మరింత విస్తరించడంలో కీలక భాగస్వామిగా నిలవడం సంతోషకరం అని డీజీపీ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *