పేలిన గ్యాస్ సిలిండర్లు

– నలుగురు మృత్యువాత

శ్రీ సత్యసాయి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *