– హెచ్చరిక బోర్డులు లేవు, అప్రోచ్ రోడ్లు పూర్తికాలేదు..
– ప్రాణాలు తీస్తున్న రాంగ్ రూట్ ప్రయాణాలు..
– ఇప్పటికే 15 ప్రమాదాల్లో ఆరుగురు బలి!
– అధికారుల భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్
వైరా/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7 : హడావిడిగా పనులు పూర్తి చేయడం.. ప్రారంభానికి ముందే రాకపోకలకు అనుమ తించడం.. ప్లాజాలు తెరిచి వాహనదారుల ముక్కు పిండి టోల్ వసూలు చేయడం.. ఇదీ ఎన్ హెచ్ ఏఐ అధికారుల తీరు. టోల్ రాబడిపై ఉన్న ధ్యాస రహదారి భద్రతపై కొరవడ టంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్నాయి. ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలకు అనుమతించడం దుర్ఘటనలకు కారణమవుతోంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162.50 కి. మీ. మేర నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ (ఎన్ హెచ్-365 బీజీ) పై కొన్ని నెలల క్రితం వైరా నుంచి రాకపోకలు ప్రారంభించి టోల్ వసూలు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం నగరం మీదుగా వాహనాలు నడుస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ హైవేలో 15 దుర్ఘటనలు జరిగాయి. తల్లాడలో ఒక కానిస్టేబుల్, వేంసూర్ లో ఉల్లిపాయల లోడు లారీ ఢీకొన్న ఘటనలో క్లీనర్, కల్లూ రు మండలం లింగాలలో రేయిలింగ్ ను బైక్ ఢీకొనడంతో ఏపీ వాసులు ఇద్దరు మరణించారు. తాజాగా మరో ఇద్దరు మృతిచెం దారు. 25 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై వైరా మండలం సోమవారం వద్ద చాలా రోజులుగా అనుమతిస్తున్నారు. అయితే ధంసలాపురం బ్రిడ్జి ఇటీవల పూర్తయిన ఇంకా ఎగ్జిట్ వద్ద ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ హడావుడిగా నాలుగు రోజుల క్రితం రాకపోకలు అనుమతించారు. ఈ విషయమై విస్తృత ప్రచారం జరగడంతో వాహనదారులు ఈ హైవేను ఎంచుకుంటున్నారు. కాగా, హైదరాబాద్ వైపు వెళ్లేందుకు ఎక్కాల్సిన అప్రోచ్ రోడ్డును పనుల దృష్ట్యా అధికారులు మూసేశారు. ఇదే సమయాన దేవరపల్లి వెళ్లే మార్గంలో హైవే ఎక్కి రోడ్డును మూసివేయలేదు. అంతేగాక హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన వారు కూడా దేవరపల్లి వైపు ఉన్న రోడ్డుఎక్కి రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను అంచనా వేయకపోవడం గురువారం నాటి ప్రమాదం జరిగిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగగానే అధికారులు హైదరాబాద్ వైపు ఎంట్రీ పాయింట్ ను వదిలేయడం గమనార్హం. దేవరపల్లి ఎంట్రన్స్ హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చే ఎగ్జిట్ దారుల్లో ఎలాంటి సైన్ బోర్డులు లేవు.
హైదరాబాద్ కు దారేది?
ఖమ్మం బోనకల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లడానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్కే ర్యాంపు ప్రవేశం దారి నిర్మాణం పూర్తి కాలేదు. దేవరపల్లి నుంచి వచ్చిన వాహనాలు ఖమ్మం నగరం లోకి వెళ్లేందుకు నిష్క్రమణ దారి లేకపో వడంతో వాహనాలు తికమక పడుతున్నారు. ఈ దారి మూసివేయడంతోనే గురువారం హైదరాబాద్ వెళ్లడానికి మరో దారిలో ఎదు రెళ్లిన కారు-డీసీఎం ఢీకొనడంతో తల్లి, కుమారుడు మరణించారు. తండ్రి ప్రాణాపా
య స్థితిలో ఉన్నాడు. అధికారులు ఏమంటున్నారంటే హైవేపై ప్రమాదాలు జరుగున్న విషయమై ఎన్హెచ్ఎఐ పీడీ దివ్య మాట్లాడుతూ.. ఖ మ్మం నగరంలో భారీ లోడు వాహనాలు రద్దీ తో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రీన్ ఫీల్డ్ పై రాకపోకలకు అనుమతించాం.ర్యాంపులు నిర్మాణం పూర్తి కాలేదని ఖమ్మంలో రాకపోక నిలిపివేశాం. వెంకటగిరి, వైరా వద్ద మాత్రమే ప్రవేశ, నిష్క్రమణ దారులు తెరి చాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





