ఉపముఖ్యమంత్రి సీపీఆర్ఓ  మధుసూదన్ గుండెపోటు తో మృతి 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు  చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో సోమవారం అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో కన్నుమూశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
 మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేసిన మధు ప్రజా సంబంధాల అధికారిగాను రాణించారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం..
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  సీపీఆర్ఓ మధు సూధన్ గుండెపోటు తో అకాల మరణం చెందడం పట్ల నీటి పారుదల శాఖ.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వృత్తి పట్ల నిజాయితీ గా ఉంటూ నిబద్ధతతో పనులు చేసే మధు మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మధు తో నాకు చాలా కాలంగా స్నేహం ఉందని ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
*తీవ్రంగా కలిచివేసింది :   రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. జర్నలిస్టుగా పలు ప్రముఖ పత్రికల్లో సేవలందించిన మధుసూదన్, అనంతరం ప్రజా సంబంధాల అధికారిగా కూడా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి మంచి పేరు సంపాదించారని మంత్రి గుర్తు చేసుకున్నారు. మధుసూదన్ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

* సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సంతాపం

ఉప ముఖ్యమంత్రి గారి సీపీఆర్ ఓ మధుసూదన్ ఆకస్మిక మరణం పట్ల సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జి. ముకుంద రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. వృత్తిలో అత్యంత నిబద్దత కలిగినవాడు, ప్రొఫెషనల్ పీఆర్ఓ గా పనిచేసే మధు హఠాత్మరణం తీరని లోటు.అని ముకుంద రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *