హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : మాదాపూర్ హైటెక్స్ హాల్ -4లో థ్రెడ్ పోచంపల్లి ఎగ్జిబిషన్‌ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సందర్శించారు. హాల్‌లోని స్టాల్స్ అన్నింటినీ ఆయన కలియతిరిగి స్టాల్స్ నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో పోచంపల్లి శాలువాలను దిల్లీలో సహచర ఎంపీలు, కేంద్ర మంత్రులకు కప్పి భూదాన్ పోచంపల్లి వస్త్రాల గొప్పతనాన్ని వివరించేవాడినని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానని ఈ సందర్భంగా వివరించారు. చేనేత వస్త్రాలను ధరించి, మన సంస్కృతి, సంప్రదాయన్నీ కాపాడుకోవాలని ఆయన కోరారు. హైటెక్స్‌లో జరిగే వస్త్ర ప్రదర్శన కార్యక్రమాన్ని సందర్శించి నాణ్యత కలిగిన వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



