ఎల్బీనగర్‌ ‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

-స్టేషన్‌ ‌ముందు కుటుంబ సభ్యుల ఆందోళన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్12: ఎల్బీనగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ‌జె.సాయి కుమార్‌ ‌బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ ‌రూమ్‌లో ఉరి వేసుకున్నట్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే సపంలోని కామినేని హాస్పిటల్‌కి తరలించగ. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు దృవీకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. 2024 బ్యాచ్‌కు చెందిన సాయికుమార్‌ను ప్రస్తుతం ఈ-కాప్స్ ‌డ్యూటీ కోసం ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయానికి అటాచ్‌ ‌చేశారు. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటున్న సాయికుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరో వైపు ఎల్బీనగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సాయికుమార్‌ ఆత్మహత్య చేసుకోలేదని, రక్తపు మరకలు ఎలా వచ్చాయని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వందలాదిమంది పీఎస్‌ ‌వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. పీఎస్‌లోకి దూసుకెళ్లి కంప్యూటర్‌, ‌ప్రింటర్‌ ‌ధ్వంసం చేశారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *