– మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై ఎంపీ చామల
హైదరాబాద్,జూన్10:మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కావాలనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారని విమర్శించారు. బీఎన్‌ఎస్ యాక్ట్ 230 ప్రకారం ఫామ్ 26 సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ.. ఎన్నికలను వాళ్ల ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఈసీని అడ్డం పెట్టుకొని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి రెండు రాజ్యసభ సీట్లకు అవకాశం ఉందని.. కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ వచ్చే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. మూడో అభ్యర్థిని బీజేపీ ఎందుకు పోటీలో నిలబెడుతోందని ప్రశ్నించారు. ముందు నుంచే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తప్పించాలని బీజేపీ చూసిందని వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయం గురించి దేశ ప్రజలకు తెలియాలన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ సమర్థిస్తుందా అని
ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఎప్పటికీ అధికారంలోకి రారని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.