రాజన్న సిరిసిల్ల,ప్రజాతంత్ర,జూన్13: రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ’సర్’ పక్రియను బీఆర్‌ఎస్ సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేటీఆర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌లాగా దొంగ ఓట్లతో గెలవాలని తాము అనుకోమని తేల్చిచెప్పారు. రైతు భరోసా వేయకుండా రేవంత్‌రెడ్డి సర్కార్ రైతన్నలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను బురిడీ కొట్టించారని ఎద్దేవా చేశారు. ’సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





