దక్షిణాదిపై కాక్రోచ్ జనతా పార్టీ నజర్

– రేపు హైదరాబాద్ ధర్నా చౌక్ లో భారీ సభ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తూ, సరికొత్త వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై  ప్రత్యేక దృష్టి సారించింది. దిల్లీ, లక్నో, పూణే వంటి ప్రధాన నగరాల్లో విజయవంతంగా నిరసనలు చేపట్టిన ఈ పార్టీ ఈనెల‌ 14న ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్వే దికగా భారీ శాంతియుత నిరసన సభను నిర్వహించనుంది. దేశంలో సంచలనం సృష్టించిన నీట్ – యూజీ పరీక్షల పేపర్ లీకేజీలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకతవకలకు నిరసనగా.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఈ సభ జరగనుంది. మాకు మేక్ ఇన్ ఇండియా అడిగితే మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు అనే వ్యంగ్య నినాదాలతో యువత ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *