– అక్రమంగా వచ్చినట్లు గుర్తింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: హైదరాబాద్ జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు నిర్దారించారు. గాజులరామారం హెచ్‌ఏఎల్ కాలనీలో అద్దె ఇంట్లో బంగ్లా జాతీయులు నివాసం ఉంటున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించగా.. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేవని గుర్తించారు. ఇతర డాక్యుమెంట్లు లేకుండానే భారత్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాల మేరకు వీరిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసిన పోలీసులు వారిని మెదక్ జిల్లా జోగిపేట డిపోర్టేషన్ సెంటర్‌కు తరలించారు. తిరిగి వారి దేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





