స‌భ‌ను అడ్డుకోవ‌డానికి ఫామ్ మౌజ్‌లో కుట్ర‌

– వెయ్యి రోజుల్లో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు వివ‌రించ‌డ‌మే స‌భ‌ లక్ష్యం
– మూడు రోజులు స‌భ జ‌ర‌గ‌కుండా అడ్డుకున్నారు
– ప్ర‌జాప్ర‌తినిధుల‌ను దూషించారు
– అధికారుల‌పై అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు
– ద‌ళితులు న‌డిచిన నేల‌ను శుద్ధిచేసి అవ‌మానించారు
– జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ‌
– సీఎల్‌పీ స‌మావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10 : ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఫామ్ హౌస్ లో కెసీఆర్ అధ్యక్షతన సభను సజావుగా జరగకుండా కుట్ర చేశారని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నిర్వ‌హించిన సీఎల్‌పీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించ‌డ‌మే స‌భ నిర్వ‌హ‌ణ ల‌క్ష్య‌మ‌న్నారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించి మూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారన్నారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం చేశారు. శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్  కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు అన్నారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు  తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నాన‌న్నారు. జరిగిన సంఘటనలపై విచారణ చేప‌ట్టామ‌న్నారు.  సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనండి. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలి. ప్రజలు ఇచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్ లో రాజకీయంగా రాణించలేరని హెచ్చ‌రించారు. అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నాం అసెంబ్లీలో సెంట్రల్ హాల్ ను ప్రారంభించుకుని దుద్దిళ్ల శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నాం. సభలో నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలి. అసెంబ్లీ జరిగినన్ని రోజులు సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి కాంగ్రెస్ కు నష్టం చేకూర్చాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీత లక్ష్మా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి  రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? పోలీస్ సిబ్బందిలో కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కనిపించినట్టున్నారని, అందుక‌నే అంత ఆక్రోశంతో అధికారులపై దాడులు చేశార‌ని వ్యాఖ్యానించారు. దేశానికి మనం చేసిన జనగణన రోల్ మోడల్. ఇది రాష్ట్రం సాధించిన ఘనత. తెలంగాణ నమూనాను జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. స‌ర్‌ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఈ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మీ ప్రతీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపు ఓటముల ను ప్రభావితం చేస్తుంది.  స‌ర్ అంశాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకోండి. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లు గా తేల్చారు, కానీ ఓటర్ల జాబితా మాత్రం 88 కోట్లుగా చూపుతున్నారు. దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయ‌న్నారు. ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉంది. వెయ్యి  రోజుల పాలనకు సహకరించి నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీ సహకారంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు తీసుకువచ్చామ‌ని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *