– ఆహార భద్రతపై సీస్ సంజయ్ జాజూ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆహార భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో శనివారం సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్ కంట్రోలర్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల అమలు, నాణ్యతలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఉన్న రెండు విభాగాలను ఏకతాటిపై నడిపేందుకు తగిన ప్రతిపాదనలను వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని సూచించారు. దీంతో ఆయా విభాగాలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి మన రాష్ట్రంలో కూడా తగిన విధంగా అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పురోగతి, సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ సి.వి.ఆనంద్, సీ¾ఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, ఎన్.శ్రీధర్, జీఏడీి ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, అడిషనల్ డీజీ(ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, వైద్య శాఖ కమిషనర్ సంగీత, డ్రగ్ కంట్రోలర్ డీజీఅవినాష్ మొహంతి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





