– ఆరో అంతస్తు నుంచి దూకి..
– అనారోగ్యం, కుటుంబ సమస్యలే కారణమా?
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూలై 4 : గచ్చిబౌలిలోని ఐఐఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్(20)గా పోలీసులు గుర్తించారు. అతడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలంగా అనారోగ్యం, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. తాను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతితో తోటి విద్యార్థులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





