ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

– సీఎంను క‌లిసిన ప‌లువురు  మంత్రులు 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : ప్రజా జీవితంలో విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీ‌హ‌రిలు ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాం క్షలు తెలిపారు. ప్రజా సేవ పట్ల ఆయన చూపుతున్న అంకితభావం, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగిస్తున్న పాలన మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

 

పాలమÖరు జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీగా ప్రారంభమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం ఆయన పట్టుదల, ప్రజల పట్ల నిబద్ధత, నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి పదవిని ప్రజా సేవకు వేదికగా మలుచుకుంట  ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న నాయకుడిగా ఆయన ఎదిగారని కొనియాడారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేదలు, ఆదివాసి  గిరిజనులు, బలహీన, అణగారిన వర్గాల సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తున్నాయని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో మరెన్నో విజయాలు సాధించి రాష్ట్రాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *