దేవుడి మీద ఒట్లు వేసి మాట తప్పారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
పాప పరిహారం కోసం వేములవాడ రాజన్నకు పూజలు
ఎంతో భక్తితో ప్రజలు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కొలుస్తారని, పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద వొట్టు వేసి మాట తప్పాడని, పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టమవుతుందని.. ఇది ప్రజలకు శాపంగా మారుతుందని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో హరీష్ రావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి చేసిన పాపం రాష్ట్ర ప్రజలకు శాపం కావొద్దని వేములాడ రాజన్నను మొక్కుకున్నానని జ్ఞానోదయం చేయాలని వేడుకున్నానని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, పంటలకు మద్దతు ధర రాక, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
మద్దతు ధర రాక దలారులకు పంట అమ్ముతున్నారు. పౌరసరఫరాల మంత్రిగా గంగుల కమలాకర్ ఉన్నప్పుడు, బిఆర్ఎస్ ప్రభుత్వం చివరి గింజ దాకా కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యానికి కు బోనస్ ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు.. రైతు బంధు ఎగ్గొట్టాడని, యాసంగి పంటకు అయినా ఇచ్చేలా చూడాలని దేవుణ్ణి కోరుకున్నానని హరీష్ రావు తెలిపారు. దేవుళ్ల మీద వొట్లు పెట్టిన మాట తప్పిన రేవంత్ రెడ్డికి భయం లేదు భక్తి లేదు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అన్నారు మాట తప్పారు. 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలి. కడితేనే రుణమాఫీ చేస్తం అన్న నిబంధన ఏమిటి అని ప్రశ్నించారు. మీరు చేసే తప్పుకు రైతులు ఎందుకు శిక్ష వేరని నిలదీశారు. 31 రకాల కారణాలు చెప్పి సగానికి పైగా రుణమాఫీ జరగలేదు. తక్షణమే రుణమాఫీ చేసి దేవుడు దగ్గర వేడుకో చెంపలు వేసుకొని రుణమాఫీ చెయ్యి అని డిమాండ్ చేశారు.
కేసీఆర్ లేకుంటే ఉద్యమం లేదు..
కేసీఆర్ మీద మాట్లాడే నైతికత రేవంత్ కు లేదని,కెసీఆర్ లేకుంటే ఉద్యమం లేదు, రాష్ట్రం లేదు, రేవంత్ సిఎం అయ్యే వాడు కాదని మాజీమంత్రి హరీష రావు అన్నారు. కేసీఆర్ అన్న మాటలో తప్పు ఏం ఉంది.. మీ పాలనలో ఏం పొందారు తెలంగాణ ప్రజలు. ఏం కోల్పోయారు చెప్పడానికి తాను సిద్ధమని తెలిపారు. ఏం పొందారో చెప్పడానికి నువ్వు సిద్ధమా.. అప్పులు, రైతుల సమస్యలు, దవాఖానలు, తాగు నీరు, సాగు నీరు, కరెంట్, విద్య, వైద్యం.. ఇలా అన్ని అంశాల్లో చర్చ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. కొవిడ్ ఉన్న సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారు. పోలీసులె తమ పోలీసులు కొట్టేలా చేసావు. నేతన్నలు ఆత్మహత్యల పాలు చేస్తున్నావు అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత ను వీపులు పగిలేలా కొట్టారు. దళిత బంధు కోల్పోయారు గొర్రెలు కోల్పోయారు, చేపపిల్లలు కోల్పోయారు. దళిత బంధు కోల్పోయారు. రైతుబంధు కోల్పోయారు.
ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఎ కోల్పోయారు. శాంతిభద్రతలు కోల్పోయారు. జర్నలిస్టులు ప్రశ్నించే హక్కు కోల్పోయారు. తెలంగాణ ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు. మొత్తంగా తెలంగాణ నెంబర్ 1 స్థానం కోల్పోయింది. కెసిఅర్ పాలనలో తెలంగాణ నెంబర్ 1 ఉంటే రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వొచ్చారు. ఇప్పటికైనా పగా, ప్రతీకారం మాను సీనియర్లను పరిగణనలోకి తీసుకో తెలంగాణ కోసం పోరాడింది పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ. కెసిఆర్ వందేళ్ల అభివృద్ధి చేస్తే, రేవంత్ ఏడాది కాకముందే వందేళ్ల వెనుకకు రాష్ట్రాన్ని తీసుకు పోయేందుకుప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మీద పరిపాలన మీద దృష్టి పెట్టాలని హరీష్రావు డిమాండ్ చేవారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు.





