– తేజస్వీ, రాహుల్‌కు నిరాశ తప్పదు
– బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా
పట్నా, అక్టోబర్ 29: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ సపిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ అని ఇప్పటికే ప్రకటన రాగా ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిపై మాత్రం స్పష్టత లేదు. దానిపైనే విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. దాంతో తాము నితీశ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తామని ఇటీవల మోదీ ప్రకటించారు. ఆయనే సీఎంగా కొనసాగుతారని తాజాగా అమిత్ షా స్పష్టం చేయడంతో ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరన్న సందిగ్ధత వీడిపోయింది. ఈ క్రమంలో రాజకీయాల్లో ఏ సీటూ ఖాలీగా లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధానిగా ఉంటారని వ్యాఖ్యానించారు. బీహార్ దర్భంగాలో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్ షా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వీయాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలను కుంటున్నారని, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని పీఎంను చేయాలనుకుంటున్నారని విమర్శించారు. కానీ ఆ రెండు స్థానాలు ఖాలీగా లేవంటూ మహాగఠ్‌బంధన్ పార్టీలను ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇచ్చి రాష్ట్ర ప్రతిష్ఠను పెంచారని అమిత్‌షా వ్యాఖ్యానించారు. అలాగే పహల్గాం దాడి గురించి ప్రస్తావించారు. ఆ ఉగ్రదాడి జరిగిన వెంటనే మోదీ ఆపరేషన్ సిందూర్‌కు ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





