ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్వీ-ఎఫ్-18 రాకెట్ ద్వారా ఎన్‌ఎస్‌వీ-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారత నావిగేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక మైలురాయి అని ప్రశంసించారు. రవాణా, విమానయానం, సముద్ర నావిగేషన్, పర్యవేక్షణ, అత్యవసర సేవల వంటి కీలక రంగాల్లో ఎన్‌ఎస్‌వి-03 మెరుగైన సేవలు అందించనుందని పేర్కొన్నారు. ఈ విజయం యావత్ దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *