న్యూదిల్లీ, అక్టోబర్23 : బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తుంది. అలాంటి వేళలో సైతం విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో సీట్ల సర్దుబాటు ఒక్క కొలిక్కి రావడం లేదు. అయితే ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మీడియా కథనాల ద్వారా వెల్లడి అవుతోంది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు ఆ కథనాల సారాంశం. దీనిపై ఈ రోజు అంటే.. గురువారం సాయంత్రం మహాగఠ్‌బంధన్‌లోని పార్టీలన్నీ కలిసి ప్రకటిస్తాయని సమాచారం. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి రెండు దశల్లో.. అంటే నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. సీపీఐ 9, సీపీఐ (ఎం) 4 స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది. మరో ఎనిమిది స్థానాల్లో మాత్రం ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు.. ఎవరికి వారు తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. అంటే మహాగఠ్‌బంధన్‌లోని పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొందని దీనిని బట్ట అర్థమవుతుంది. అయితే ఈ కూటమిలో చీలక ఏర్పడిరదంటూ ఇప్పటికే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడనున్నాయి. దీంతో ఏ పార్టీకి వోటరు పట్టం కట్టాడనేది ఆ రోజు సుస్పష్టం కానుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





