బోనాల జాతర.. ప్రజలకు బీజేపీ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం, గంగ-జమున తహజీబ్‌కు ప్రతీక అయిన చరిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఆత్మగా నిలిచే ఈ బోనాల పండుగ మన జానపద వైభవానికి, భక్తిశ్రద్ధలకు నిదర్శనమన్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో ప్రారంభమై.. లష్కర్ మహంకాళి జాతర, పాత బస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఉత్సవాల వరకు సాగే ఈ సంబురం యావత్ తెలంగాణకు ఒక సరికొత్త పండుగ వాతావరణాన్ని, ఉత్తేజాన్ని తీసుకువస్తుందని తెలిపారు. ఆ అమ్మవారి చల్లని చూపుతో రాష్ట్రంలోని అన్నదాతలు, శ్రామికులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మన రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ప్రజలందరూ ఈ జాతరను భక్తిశ్రద్ధలతో, అత్యంత సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *