ఎంఎస్ఎంఈల కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌’

– సమస్యల పరిష్కారానికి నెలకోసారి ఎంఎసఎంఈ గ్రీవెన్స్ డే
– నగరంలోని పారిశ్రామికవాడల అభివృద్ధికి చర్యలు
– ఎల్ యూబీ ఎంఎస్ఎంఈ సౌత్ ఇండియా సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ విశ్వవ్యాప్తమయ్యేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవకాశాలు, పెట్టుబడుల అనుసంధానం తదితర అంశాల్లో ఎంఎస్ఎంఈలకు మార్గ నిర్దేశం చేస్తామన్నారు. లఘు ఉద్యోగ్ భారతి(తెలంగాణ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో శనివారం నిర్వహించిన ఎల్‌యూబీ ఎంఎస్ఎంఈ సౌత్ ఇండియా సమ్మిట్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎంఎసఎంఈలు లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ పారిశ్రామికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఈ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎంఎసఎంఈ పాలసీని తీసుకొచ్చిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. క్షేత్రస్ధాయిలో ఎంఎసఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి ఆచరణాత్మక పరిష్కారాలు చూపించేందుకు నెలకోసారి ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ ఎంఎసఎంఈ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యత, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై ఎంఎసఎంఈలు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఎండీ రామ్మోహన్ రావు, లఘు ఉద్యోగ్ భారతి ప్రతినిధులు వై.వెంకటేశ్వర్లు, కె.నరేంద్రనాథ్ దత్, ఓం అనూజ్ ఖదేల్వాల్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *