యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

– యుద్ద ప్రభావంతోనూ సరఫరాలో అంతరాయం
– రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టవద్దు
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు ఆరోపించారు. యుద్ధ ప్రభావంతో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌కు ముందే కేంద్రాన్ని పలుమార్లు కోరినా సమస్య కొనసాగుతోందన్నారు. యూరియా సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. పంట వ్యర్థాలను తగలబెట్టడం రైతుల భవిష్యత్తుకే ప్రమాదమని హెచ్చరించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని, నేలలోని పోషకాలు తగ్గిపోవడంతో యÖరియా, పురుగుమందుల ప్రభావం కూడా తగ్గిపోతుందని మంత్రి తెలిపారు. భూమిలో కలియదున్నాలని రైతులకు సూచించారు. అయినప్పటికీ పంట అవశేషాలను కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శాటిలైట్ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.  సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న విమర్శలు అన్యాయమన్నారు. ఎల్‌నినో ప్రభావంతో సాధారణంగా పడే వర్షాలు తగ్గే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. అందువల్ల రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *