అజ్ఞాతంలో మరో 47మంది మావోయిస్టులు

– తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నలుగురే
– లొంగిపోయిన‌ నరహరి, ధనమ్మ జంటకు చెక్కులు అందచేత
– గణపతి తదితరులు కూడా వెంటనే లొంగిపోవాలి
– డీజీపీ ఆనంద్ పిలుపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాలపాటు పనిచేసిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఈనెల 12న తన భార్యతో పోలీసుల ఎదుట లొంగిపోగా వారిని మంగళవారం డీజీపీ కార్యాలయంలో విÖడియా ఎదుట ప్రవేశపెట్టారు. లొంగిపోయిన వారిద్దరికి రూ.25 లక్షలు, రూ.20 లక్షలు చొప్ప్పున డీజీపీ సీవీ ఆనంద్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 47మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. అందులో తెలంగాణాకు చెందిన వారు ముగ్గురు, ఏపీకి చెందిన వారు ఒకరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు 15, జార్ఖండ్ 13, ఒడిశాకు చెందిన 15మంది ఉన్నారని వివరించారు. 2024 నుండి ఇప్పటివరకు 822 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు. మొత్తం 334 ఆయుధాలతో వీరంతా తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారని చెప్పారు. ఇక తెలంగాణా పోలీసులు ముందు లొంగిపోయిన ఒడిశాకు చెందిన మావోయిస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామన్నారు. మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టులను త్వరలో వారి ప్రాంతాలకు వెళ్లి స్వయంగా కలుస్తానని డీజీపీ స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ గణపతితోపాటు జాడే రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు లొంగిపోవాలని ఈ సందర్భంగా వారికి డీజీపీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. విÖరు లొంగిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలు కల్పిస్తామని హావిÖ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *