Category తెలంగాణ

మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

– సిద్దిపేట, హన్మకొండ, ములుగులకు వర్తింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29:  ‌మొంథా తుఫాన్‌ ‌ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని…

ఎగుమతుల దిశగా తెలంగాణ బియ్యం

– భారత్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న పౌరసరఫరాల శాఖ – ప్రత్యేకంగా స్టాల్‌ ఏర్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ఆల్‌ ఇండియా రైస్‌ ఎక్స్‌పోర్ట్సు అసోసియేషన్‌ (ఏఐఆర్‌ఈఎ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్‌ ఇంటర్నేషనల్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌ను ఈనెల గురు,శుక్రవారాలలో న్యూదిల్లీలో నిర్వహించనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖా…

ఏసీబీ వ‌ల‌లో యాదగిరిగుట్ట ఆలయ ఈఈ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఈఈ రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకి బుధవారం పట్టుబడ్డారు. హైద‌రాబాద్‌ ఉప్పల్‌ పరిధిలో ఓ ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ దగ్గర రూ.1.90 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన పలు ఆస్తులతోపాటు ఆయన…

సీఎంను కలిసిన మైనారిటీ సంఘాల నేతలు

– కాంగ్రెస్‌లో బీజేపీ మాజీ కార్పొరేటర్‌ కిలారి చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: వివిధ మైనారిటీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి,…

మత్స్య సంపద అభివృద్ధికి రూ.123 కోట్లు

– కోయిల్ సాగర్ ప్రాజెక్టులో చేప పిల్ల‌ల విడుద‌ల‌ –  దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి కృషి – మంత్రి వాకిటి  శ్రీహరి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29: చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని మత్య, పాడి, పశు సంవర్ధక యువజన సర్వీసులు ,క్రీడల శాఖ…

సామాజిక తెలంగాణ సాధన కోసం పోరాటం

– విప్ల‌వాత్మ‌క ఆలోచ‌న‌తోనే ఇది సాధ్యం – పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి – జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర, అక్టోబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా అభివృద్ధిలో ఇంకా వెనుక‌బ‌డే వున్నందున‌ సామాజిక తెలంగాణ సాధన కోసం జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టామని జాగృతి వ్యవస్థాపకురాలు…

లకడికాపూల్‌లో పైపు లైను పనులు పూర్తి చేయాలి

– రహదారులపై నీరు నిలవకుండా చూడాలి – క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: తీవ్ర తుపానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లకడికాపూల్‌ పరిసర ప్రాంతాలను హైడ్రా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్‌, ఆర్‌ వీ కర్ణన్‌లు పరిశీలించారు. మాసబ్‌ ట్యాంకు నుంచి లకడికాపూల్‌…

ప్రజలలో కాంగ్రెస్‌ నైజాన్ని ఎండగట్టాలి

– పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి – ఉప ఎన్నికలో లంక‌ల గెలుపు ఖాయం – పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పార్టీ రథసారధి రాంచందర్‌ రావు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు,…

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

– అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జలమండలి ఎండీ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావంతో నగరం ముసురేసింది. హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి ఆదేశించారు. వర్షం వల్ల నగర పజలకు…