– భారత్ రైస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న పౌరసరఫరాల శాఖ
– ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట్సు అసోసియేషన్ (ఏఐఆర్‌ఈఎ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్‌ను ఈనెల గురు,శుక్రవారాలలో న్యూదిల్లీలో నిర్వహించనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖా శాఖ ఈ సదస్సులో పాల్గొనాలని నిర్ణయించింది. రాష్ట్ర బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతి అవకాశాలను విస్తరించేందుకు ఈ కాన్ఫరెన్స్ ను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని నిర్ణయించింది. అందులో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





