– కోయిల్ సాగర్ ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల
– దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి కృషి
– మంత్రి వాకిటి శ్రీహరి
– దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి కృషి
– మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని మత్య, పాడి, పశు సంవర్ధక యువజన సర్వీసులు ,క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బొల్లారంలో కోయిల్ సాగర్ ప్రాజెక్టులో రూ.12 లక్షల విలువ గల 7 .77 లక్షల చేప పిల్లలకు గాను మొదటి విడత 2.50 లక్షల చేప పిల్లలను వంద శాతం సబ్సిడీతో మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మత్స్య శాఖ డి.డి. ఖదీర్ అహ్మద్, మత్స్య శాఖ ఏడి రాధారోహిణి, మత్స్య సహకార సంఘాల అధ్యక్షులతో కలిసి బుధవారం వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం రూ.123 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.94 కోట్లతో 88 కోట్ల చేప పిల్లలను రాష్ట్రంలోని 26,000 చెరువుల్లోరూ.29 కోట్ల తో 300 చెరువులలో 10 కోట్ల రొయ్యలను వంద శాతం సబ్సిడీతో వదలుతున్నట్లు తెలిపారు. చేపల పెంపకంతో మత్స్య రంగంపై ఆధారపడ్డ 5 లక్షల మత్స్య కారులకి ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధి కలుగనున్నట్లు తెలిపారు. మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాలను అబివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గాన్ని మొదట అభివృద్ధికి మక్తల్ నియోజకవర్గంతోపాటు ప్రాధాన్యత నివ్వనున్నట్లు తెలిపారు. గత పాలకులు పదేళ్లలో చేప పిల్లల ఉత్పత్తి పై దృష్టి పెట్టలేదనన్నారు. రాష్ట్ర కేబినెట్ లో మొట్టమొదటిసారి ముదిరాజ్ నైన తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. తాను joబినెట్ మంత్రినైన తర్వాత మత్స్య శాఖకు ఆరకొరగా కేటాయించిన బడ్జెట్ పెంచాలని అడిగిన వెంటనే రూ.123 కోట్లు చేపల ఉత్పత్తికి కేటాయించిన ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు. చెరువుల్లో చేపలు వేయడంతోపాటు చేపల సంఖ్య, చేపల రకాలు,సైజు, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు,డైరెక్టర్ లు, అధికారి పేర్లు, ఫోన్ నెంబర్లతో బోర్డు ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, దేవరకద్ర ఎమ్మెల్యే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయక రెండేళ్లలో సుమారు రూ.500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. వెనుకబడిన వ్యవసాయారాధిత నియోజకవర్గంలో రూ.270 కోట్ల రుణ మాఫీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.175 కోట్లతో 3600 ఇందిరమ్మ ఇండ్లు పేదలకు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో 3600 ఇండ్లు మంజూరు కానున్నట్లు తెలిపారు. బొల్లారంలో ఉన్న చేపల పెంపకం కేంద్రం నవీకరణ పనులకు రూ.కోటి మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా కొత్తకోట, మదనాపురం, దేవరకద్రలో చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వలె కాకుండా చేపలు 80 ఎంఎం సైజు తక్కువ కాకుండా, ఖచ్చితమైన నంబర్ తో చేపలపై శ్రద్ధ వహించినట్లు, నియోజకవర్గంలో నాలుగు చేపల విక్రయ కేంద్రాలకు 60 శాతం సబ్సిడీతో మొబైల్ వాహనాలు అందజేసినట్లు తెలిపారు. వెటర్నరీ హాస్పిటల్స్‌లో మందుల సరఫరాకు చర్యలు తీసుకోవాలని, వాటిని అప్‌గ్రేడ్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో నవీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, ఎంపీడీవో శ్రీనివాస రావు, తహసీల్దార్ దీపిక, మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం దేవరకద్ర మండలం నార్లోని కుంటలో జి.పి. భవనాన్ని మంత్రి శ్రీహరి ప్రారంభించారు. పెద్ద గోపాల్ పూర్, మీనగోయినపల్లి, బలుసుపల్లి గ్రామం ఓపెన్ జిమ్, పార్క్ ల సుందరీకరణ, అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. తర్వాత దేవరకద్ర మండలంలో ఇందిరమ్మ మోడల్ హౌస్, సహాయక ఇంజనీర్ కార్యాలయం ప్రారంభించారు.
————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





