Category తెలంగాణ

సీఎంకు మంత్రి సీత‌క్క దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 21ః దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్న పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ద‌న‌సరి అన‌సూయ సీత‌క్క‌. ఈ సంద‌ర్భంగా  సీఎం కుటుంబ సభ్యుల‌కు ఆమె దీపావ‌ళి శుభాకాంక్షలు తెలియచేశారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…

సర్దార్‌ పటేల్‌ మనందరికీ స్ఫూర్తి దాత

– ఆయన పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు ఉప్పొంగుతాయి – పటేల్‌ 150వ జయంతి కార్యశాలలో రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు గర్వంతో నిండుతాయి. ఎందుకంటే ఆయన కృషి వల్లే ఈరోజు తెలంగాణ భారతదేశంలో భాగమైంది. చరిత్రను వక్రీకరించి రాజకీయ లాభం…

ఏకశిలా పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

Hanmakonda News

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : హన్మ‌కొండ (Hanmakonda)బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్‌) రూ.5 లక్షల నిధులతో ప‌లు అభివృద్ధిప‌నులకు శంకుస్థాప‌న చేశారు. పార్క్ కు తూర్పు వైపున ఐరన్ గేట్, యోగా షెడ్, జిమ్‌లో కంకర, పిల్లల ఆట స్థలంలో ఇసుక, ఆర్చ్ వద్ద ఎర్రమట్టి పోసి మొక్కలు…

పారా అథ్లెట్‌ అర్చనకు కేటీఆర్‌ అండ

– శ్రీలంక ఛాంపియన్‌షిప్‌నకు వెళ్లేందుకు ఆర్థిక సాయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) పారా-అథ్లెట్‌ మిట్టపల్లి అర్చనకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన…

మధిర మహిళలు ఆదర్శంగా నిలవాలి

– ఇందిరా మహిళా డెయిరీ పథకంతో నా కల నెరవేరింది – త్వరలో బోనకల్లు మండలంలో డెయిరీ ఏర్పాటు మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు భారత దేశానికి ఆదర్శంగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఇందిరా మహిళ డెయిరీ…

అభివృద్ధిలో యాదవుల సహకారం అవసరం

– యాదవ సోదరులు నమ్మకానికి మారుపేరు – సదర్‌ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: తెలంగాణ ఏర్పాటులో, అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సదర్‌ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి నిధులు అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్‌…

ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చాం

– రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: రెండేళ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.…

విద్యపై రాజీ పడేదే లేదు

– అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య – అదే ప్రజాప్రభుత్వ లక్ష్యం – ‘యంగ్‌ ఇండియా’ పనులు పరిశీలించిన భట్టి విక్రమార్క బోనకల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: విద్య అనేది భవిష్యత్తు తరాలకు మనం అందించే ఒక అతిపెద్ద ఆస్తి అని, అందుకే తెలంగాణ బిడ్డలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రజా…

ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడాలి

– ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి – మొగులయ్య వేదన విని అండగా ఉంటానన్న కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18 : ఇంటి స్థల సమస్య, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారు. కేటీఆర్‌ను మొగులయ్య శనివారం కలిసి…