– యాదవ సోదరులు నమ్మకానికి మారుపేరు
– సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: తెలంగాణ ఏర్పాటులో, అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి నిధులు అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సదర్ సమ్మేళనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమంలోనూ, రాజకీయాల్లోనూ యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పించిందన్నారు. వారికి మరిన్ని అవకాశాల కోసం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. కొన్నిసార్లు ఆలస్యమైనా సరే అవకాశాలు కల్పించి సముచిత గౌరవం అందిస్తామని చెప్పారు. మీకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం వద్దకు రండి.. పరిష్కరించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్దిలో యాదవ సోదరుల సహకారం ఎంతో అవసరం అని, మీ సహకారం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





