బొమ్మల పెళ్ళి

‘అచ్చం మా అమ్మలా వుంది’ అప్పటికి యే పదోసారో అనుకున్నాడు తండ్రి, పెళ్ళిదుస్తుల్లో వున్న కూతుర్ని చూసి మురిసి ముచ్చటపడి. కళ్ళుపట్టని అందాల అలంకృత పెళ్ళికూతుర్ని చూసి ‘అమ్మలా కాదు, బుట్టబొమ్మలా వుంది’ నవ్వాడు మావయ్య. ‘ఆమె బొమ్మే, ఆమెకు సొంత అభిప్రాయాలు లేవు, తలిదండ్రులు చెప్పినట్టు నడుచు కుంటుంది ఆ అమ్మాయిని యిష్టపడ్డ కుర్రాడు…







