Category సాహిత్యం-శోభ

పి. ఎస్.చారికి శీలావీ చిత్రకళా పురస్కారం

శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం శీలా వీర్రాజు సాహిత్య పురస్కారం, శీలా వీర్రాజు చిత్రకళా పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ ఏడాది (2025) సాహిత్య పురస్కారం కోసం రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్ళెగారు రచించిన “గారడివాడు” కథాసంపుటి ఎంపికయింది. ఇది సమకాలీన సామాజిక యథార్థాలను ప్రతిబింబించే విశిష్ట రచనగా గుర్తింపు పొందింది. ముని…

నాలుగు దశాబ్దాల తిర్మల్ ఉద్యమ సాహిత్యం-వికాస్

ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్టుగా బహుముఖీన పాత్ర నిర్వహిస్తున్న తిర్మల్ సాహిత్యానికి నాలుగు దశాబ్దాలకాలం నిండింది. మహాకవి శ్రీశ్రీతో ఏర్పడిన సాన్నిహిత్యం, మాచర్ల విరసం మహాసభల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా విప్లవసాహిత్యంలో బాగం అయ్యారు.అప్పట్లో ఖమ్మం జిల్లా విరసం యూనిట్ కార్యదర్శిగావిరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్న తిర్మల్ఖమ్మం విరసం యూనిట్ ద్వారా‘ఉద్యమ గానం’ పాటల…

అక్షరాలా…

బమ్మిడి జగదీశ్వరరావు ఈరోజుల్లో బరువు పెరగడం సర్వసాధారణం. నా బరువు కథ తేలికగా అర్థమయ్యేలా చెపుతాను. నన్ను చిన్నప్పుడంతా యెత్తుకు మోశారు. ఇప్పుడు కూడా నన్ను యెవరన్నా యెత్తుకు మోస్తే బాగుణ్ణనిపిస్తుంది. ‘ఎత్తుకుంటే యెత్తుమరిగిపోతారు’ అని చిన్నప్పుడు అమ్మ హెచ్చరించేది. మనల్ని యెవరన్నా మోయడం మనకి బాగుంటుంది. కాని అమ్మమాట గుర్తొచ్చినప్పుడల్లా అదొకజబ్బని గుర్తుచేస్తున్నట్టే వున్నా…

అన్నవరం దేవేందర్‌తో  ‘కవిసంధి’

మే25వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు కరీంనగర్‌లోని ఫిల్మ్‌భవన్‌ ఏసి హాల్‌లో ప్రముఖకవి అన్నవరం దేవేందర్‌ ‘కవి సంధి’ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ  ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో తన సాహిత్య జీవన యాత్రను అన్నవరం దేవేందర్‌ వివరించి కవితా పఠనం చేస్తారు. అనంతరం ప్రశ్నలు, సమాధానాల సెషన్‌ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని…

భాషే ఆమె దేశమూ ప్రపంచమూ

-వంశీకృష్ణ సింధూరం, రక్త చందనం, బందూకు, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక ఇవిమాత్రమేకాదు విప్లవానికి కావలసింది. ఇవిమాత్రమే విముక్తికి సంకేతాలు కాదు. ఒక్కొక్కసారి మనం కలలోకూడా ఊహించని సంకేతాలు మనం అనుభవించే తీవ్రమైన వేదననుంచీ అణచివేత నుంచీ కాసేపైనా విముక్తిని ప్రసాదించే సాధనాలు కావచ్చు. ఆ విముక్తి సాధనం…

తత్వరాగం

-రేడియమ్ బాల్యం ఆటల్లో గడిచి  పోయింది యవ్వనం నిద్రలో మునిగి పోయింది వృధ్యాపం కుంకిమంచంలో పడి ఏడ్చింది విత్తనం వృక్షమై చివరకు కూలిపోయింది అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు పరుగులు తూర్పుసూర్యుడు పడమరలో కలసి పోయినట్లు జీవితం సాగిపోయింది త్రికాలాలు  ఆరువంసతాలు అరవై త్రికాలాల చీకటి వెలుగులు ప్రతి బతుకులో ఆకుపచ్చని అందాలు తుదకు పండిరాలే…

డ్రగ్స్ – డ్రీమ్స్

-ఫిజిక్స్ అరుణ్ కుమార్ ఉక్కు సంకల్పపు యువత రేపటి తరపు దేశ భవిత వివేకానంద అమృత వచనాలు అబ్దుల్ కలాం అంతరిక్ష స్వప్నాలు నల్లమందు ఆకాశపు మత్తులో ఎగిరిపోతున్నాయి గంజాయి స్వరం ఓ గన్ లా మారి మానవతా విలువల్ని మట్టిలో కలిపేస్తుంటే మాదక ద్రవ్యాల వాడకం మరణశాసనాలను లిఖిస్తున్నాయి డ్రగ్స్ డ్రీమ్స్ మత్తు, రాకెట్ల…

అనివార్యం

-గిరి ప్రసాద్ చెలమల్లు ఆకలి తాండవిస్తుంది నిరుద్యోగం పేట్రేగిపోతుంది ద్రవ్యోల్బణం రెక్కలొచ్చి ఎగురుతుంది సామాజిక బహిష్కరణల తంతు యథావిధిగా గూడు కోసం పడని పాట్లు లేవు ఇవేవీ పరిష్కరించలేనప్పుడు మతం పడగలిప్పుతుంది ఇరుగుపొరుగు రాజ్యాల్లో ఏలికలంతా కొట్లాటలకు సిద్ధం అంతర్గతసమస్యలకి ఆజ్యంపోస్తూ బ్రతికిస్తుంటుంది తాము గద్దెపై కూర్చునుటకు మనిషిని మనిషిగా గుర్తించలేని మతాలే ఉన్మాదాన్ని పెంచి…

ఇక యుద్ధం మీ ఇష్టం

  -పట్లొళ్ళ బక్కారెడ్డి అవని ఏ జాగాలో అయినా ఉసిగొలిపే నియంతల విద్వేషం ఉన్మత్తుల ఉన్మాదం యుద్ధం ప్రపంచ దేశాల ప్రవచనం ప్రాదేశిక శాంతిభద్రతల ప్రాధాన్యం గురివింద బోధనల చందం శకుని మామల డెందం అనుమాన బీజాల అడుగులు అణుంగుదేశాల విధానాలు ఆచరించని నీతి బోధనలు ఆత్మ విమర్శ లేని గుణపాటాలు యుగ యుగంలో జరిగిన…