శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం శీలా వీర్రాజు సాహిత్య పురస్కారం, శీలా వీర్రాజు చిత్రకళా పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ ఏడాది (2025) సాహిత్య పురస్కారం కోసం రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్ళెగారు రచించిన “గారడివాడు” కథాసంపుటి ఎంపికయింది. ఇది సమకాలీన సామాజిక యథార్థాలను ప్రతిబింబించే విశిష్ట రచనగా గుర్తింపు పొందింది. ముని సురేష్ గారు కథా రచయితగా తెలుగుసాహిత్యంలో తనదైన ముద్రవేసిన రచయిత. సమకాలీన సామాజికఅంశాలను హృద్యంగా చూపిస్తూ, గ్రామీణజీవనాన్ని, మానవసంబంధాలను చిత్రించేశైలికి ఆయనకి ప్రత్యేకగుర్తింపు ఉంది.చిత్రకళా విభాగంలో శీలా వీర్రాజు చిత్రకళా పురస్కారం 2025 ని ప్రముఖ చిత్రకారుడు పిఎస్చారి గారికి ప్రకటించాము.
ఆయన చిత్రకళా సాధన, సృజనాత్మకతను గుర్తించి ఈ గౌరవాన్ని అందజేస్తున్నాము. పి.ఎస్. చారి గారు ఇరవైసంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సృజనాత్మక కళాకారుడు. తెలంగాణ గ్రామీణ జీవనశైలి, స్థానిక ప్రజల జీవనవిధానాన్ని తనచిత్రాల్లో వైవిధ్యభరితంగా, శక్తివంతంగా చిత్రీకరిస్తారు. చారిగారి చిత్రాలు పలు ప్రదర్శనల్లో ప్రాచుర్యం పొందాయి. ఈ పురస్కారాల ప్రదానోత్సవం జూన్ 7, 2025న రవీంద్రభారతి, హైదరాబాద్‌లోని కళా ప్రాంగణంలో జరగనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంగా, శీలా వీర్రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 250 మంది కవుల కవితా సంకలనం అయిన ‘శీలాక్షరాలు’ కవితా సంపుటిని ఆవిష్కరించనున్నాము.
-శీలా సుభద్రాదేవి
శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక