-రేడియమ్
బాల్యం ఆటల్లో గడిచి పోయింది
యవ్వనం నిద్రలో మునిగి పోయింది
వృధ్యాపం కుంకిమంచంలో పడి ఏడ్చింది
విత్తనం వృక్షమై చివరకు కూలిపోయింది
అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు పరుగులు
తూర్పుసూర్యుడు పడమరలో కలసి పోయినట్లు
జీవితం సాగిపోయింది
త్రికాలాలు ఆరువంసతాలు
అరవై త్రికాలాల చీకటి వెలుగులు
ప్రతి బతుకులో ఆకుపచ్చని అందాలు
తుదకు పండిరాలే ఆకులు
వైరాగ్యపు పాటలు ఒక వైపు
వైవిధ్య జీవిత గానాబజానాలు ఒకవైపు
వైషమ్య రక్తపాత గాధల డోలక్ ఒకవైపు
నిడారంబర నిశ్చల నిర్మల లలితగీతం ఒకవైపు
నింగిన నిగనిగలాడే తారలైన జనపదాలు ఒక వైపు
ఎటువైపు తొంగిచూచిన
ఎత్తు పల్లాలు ఎగుడు దిగుళ్లే
పుట్టుక సార్థకం చేసు కోవడమే పరమార్థం
మట్టిలో కలిసి పోవడమే జీవవైవిధ్యం