Category ఎడిటోరియల్

 రక్తమోడుతున్న రోడ్లు 

భారతదేశ రోడ్లు, రహదారులు భద్రతకు కాకుండా, నిత్యం మారణహోమానికి చిరునామాలుగా మారుతున్నాయి. నవంబర్ 3, సోమవారం రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర విషాదం, అలాగే అంతకుముందు రోజు రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో సంభవించిన దుర్ఘటన దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై నెలకొన్న భయానక పరిస్థితికి నిదర్శనం. రంగారెడ్డి జిల్లాలో కంకర లోడుతో అతివేగంగా,…

మరో విషాదం: ఏసీ బస్సుల్లో ప్రయాణ భద్రత ప్రశ్నార్థకం

ఈ నెల అక్టోబర్ 14 న జైసల్మేర్ లో 26 మంది, కర్నూలులో నేడు 20 మంది ప్రయాణీకులను బలిగొన్న రెండు ప్రైవేట్ ఏసీ బస్సుల అగ్నిప్రమాదాలు దేశ రహదారి భద్రతపై తీవ్రమైన, అత్యవసరమైన చర్చను లేవనెత్తుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘోర ప్రమాదాలు… భారతీయ ప్రయాణీకులకు విలాసవంతమైన ప్రయాణంగా…

బాధ్యతలు విస్మరిస్తున్న పౌర సమాజం

పోలీసు వ్య‌వ‌స్థ లేని స‌మాజాన్ని ఊహించ‌లేం. ఆరాచ‌కుల ఆగ‌డాలనుంచి సామాన్యుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డమ‌నే త‌మ విధినిర్వ‌హ‌ణ‌లో ప్రాణాల‌కు ఎంత‌మాత్రం వెర‌వ‌ని పోలీసుల త్యాగాలు స‌దా సంస్మ‌ర‌ణీయం.  విధి నిర్వ‌హ‌ణ‌లో ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి  వ‌ర‌కు 191 మంది పోలీసులు అసువులు బాయ‌టం సామాన్యుల ర‌క్ష‌ణ‌కు, అరాచ‌క‌శ‌క్తుల‌ను అణ‌చివేయ‌డంలో త‌మ ప్రాణాల‌ను లెక్క‌చేయనిత‌నాన్ని వెల్ల‌డిస్తున్న నిష్టుర…

కాంగ్రెస్‌కు సవాల్‌గా గత ఎన్నిక హామీలు ..!

జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సరిగ్గా 23 నెలల కింద అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ ప్రజలకిచ్చిన హామీలు ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిబంధకమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ ఈసారి ప్రజల తీర్పును ఎవరూ అంచానా వేయలేకపోతున్నారు. రాష్ట్రంలో…

నిలకడ లేని విధానం 

ఆఫ్ఘనిస్తాన్‌లో 2021లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్ (ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్) తో భారతదేశం నిర్వహించే సంబంధాలు, ముఖ్యంగా ఉన్నత స్థాయి ప్రతినిధులను ఆహ్వానించడం లేదా వారితో చర్చలు జరపడం అనేది అంతర్జాతీయ సంబంధాల రంగంలో, దేశీయ రాజకీయాల్లో సంక్లిష్టమైన, తీవ్ర విమర్శలకు దారితీసే అంశం. భారతదేశం తాలిబాన్‌ను అధికారికంగా గుర్తించనప్పటికీ, దౌత్యపరమైన లేదా పరిపాలనాపరమైన…

జూబ్లీహిల్స్‌లో పార్టీల హడావుడి

పోలింగ్‌ ‌తేదీ ప్రకటనతో జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలో రాజకీయపార్టీల హడావుడి కొనసాగుతున్నది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ జూబ్లీహిల్స్‌పైనే ఫోకస్‌ ‌పెడుతున్నాయి. కాగా రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఎన్నికలో పార్టీల విజయావకాశాలపై లెక్క లేస్తున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధానపార్టీలు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్‌ ఈ ఎన్నికలో ఎట్టిపరిస్థితిలో…

స్థానిక ఎన్నికల్లో ఎవరి ధీమా వారిదే

స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలకాగానే గెలుపుపై రాజకీయ పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమ జండాకు ఎదురులేదని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ చెబుతుంటే, ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌పరాభావాన్ని ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్‌ ‌విమర్శిస్తోంది. అంతేకాదు ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని ఆ పార్టీ నొక్కి చెబుతున్నది. కాగా దిల్లీ ఎన్నికలే కాదు.. గల్లీ…

క్రీడ‌ల‌ను క‌లుషితం చేస్తున్న రాజ‌కీయాలు

ఒక ఆట‌గాడి నైపుణ్యం గెలుపు ఓట‌ముల్లోనో లేక రాజ‌కీయ ప్ర‌భావిత వేదిక‌లు లేదా త‌రుముతున్న జాతీయ‌వాదంలోనో వెల్ల‌డి కాదు. కేవ‌లం ఆట‌లో అత‌ను చూపిన నైపుణ్యంపైనే అత‌ని ప్ర‌తిభ‌ను క్రీడాభిమానులు, విశ్లేష‌కులు గుర్తిస్తారు.  మ‌నం ఒక టీవీ సీరియ‌ల్‌ను వీక్షిస్తున్న‌ప్పుడు, అది ఎంత‌టి అద్భుత‌మైన క‌థ‌న‌మైనా,  పాత్ర‌లు ఎంతో గంభీరంగా వున్న‌ప్ప‌టికీ, క‌థ ర‌చ‌నాశైలి, న‌డిపిన…

మరోసారి గిన్నీస్‌ ‌బుక్‌ ‌రికార్డులో ‘బతుకమ్మ’

“తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయ సమ్మేళనానికి అద్దం పడుతుంది ఈ పండుగ. గౌరీ దేవిగా, పార్వతిగా, కాళీమాతగా పూజించడంతోపాటు సంపూర్ణ స్త్రీ మూర్తికి ప్రతిబింబంగా ఆరాధించడం  ఆనవాయితీగా వొస్తున్నది. మహిళ కోసమే ప్రత్యేకించబడిన ఈ పండుగ సమాజంలోని మహిళల పాత్రను, కుటుంబ కట్టుబాట్లను తెలియజేస్తుందనడానికి బతుకమ్మ పాటలే నిదర్శనం. నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో సులభశైలిలో…