Category ఎడిటోరియల్

కౌలు రైతు ‘భరోసా’పై కాంగ్రెస్‌ స్వరం మారిందా ..?

కౌలు రైతుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన పదినెలల్లోనే తన మాటను మార్చుకున్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దిల్లీ లో  మీడియా ముందు చేసిన ప్రకటన అదే విషయాన్ని చెబుతున్నది. రైతు, కౌలు రైతును విడదీసి చూసే పరిస్థితిలో ప్రభుత్వం…

‘జమిలీ … సాధ్యమా..?

Union Cabinet Approves One Nation, One Election Proposal

త్రిబుల్‌ తలాఖ్‌, ఆర్టికల్‌ 370 రద్దు మరియు అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి క్లిష్టమైన అంశాలను తమ ఆలోచనలకు అనుగుణంగా అమలు చేసిన కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం మంగళ వారం మరో సంక్లిష్టమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. జమిలి ఎన్నికలుగా ప్రచారంలో ఉన్న  ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’…

తెలంగాణా జిందాబాద్!

Telangana Liberation Day

హైదరాబాద్ సంస్థానం  (ఆ సంస్థానంలో అత్యధిక భాగం తెలంగాణం ) ప్రజా పాలనకు అంకురార్పణం అయినా రోజు సెప్టెంబర్ 17…  శుభ సందర్భం..! డెబ్బై అయిదు  సంవత్సరాల కిందట 1948 సెప్టెంబర్ 17వ తేదీనాడు తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మరాఠ్వాడ, కన్నడ ప్రాంతాలు నిజాం రాజు నిరంకుశత్వం శృంఖలాల నుంచి, రజాకార్ మతోన్మాదుల రాక్షసత్వం నుంచి విముక్తి పొందాయి. . అది ఏడు తరాల, రెండు వందల ఇరవయి నాలుగు…

వినాయకుడు, నాయకుడు

Ganesh-Chaturthi-Celebration-in-India

భాద్రపదశుద్ద చవితి సెప్టెంబర్ 7 న రాష్ట్రవ్యాప్తంగా మరియు  హైదరబాద్‌ – ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో విఘ్నేశ్వరుని పూజలు ఘనంగా ప్రారంభమయినాయి . జంట నగరాలలోని వాడవాడ, ప్రతిబస్తీలో, ప్రతివీధిలో, అన్ని రోడ్లపైన ఎటుచూసినా గణపతి దర్శనం లభిస్తుంది . ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనానికి విఘ్నం కూడా తొలిగి పోయింది.హై కోర్టు అనుమతినిచ్చింది. జంట…

అర్థరాత్రి అనూహ్య పరిణామాలు

ఉద్యమ పార్టీకి ఎదురీత మొదలైంది. ఆ పార్టీ ఇరవై నాలుగేళ్ళ ప్రస్తానంలో పదేళ్ళ పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన బిఆర్ఎస్‌కు ఇప్పుడు పెను సవాళ్ళు ఎదురవుతున్నాయి. తమ పార్టీని బలపర్చుకునేందుకు గతంలో తాము చేసిన ఎత్తుగడలే రివర్స్‌లో తమకు ఎదురవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నది. ఉద్యమకారులను కాదని, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తే,…

బీజేపీలో పాత కొత్త కలహాలు

‘పార్టీ విత్ ఏ డిఫరెన్స్’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు.. ‘‘మంచి…

కవిత్వమే ఒక జీవన వీచిక…

అంతరంగ సంవేదనే కవిత్వానికి జీవం. కవిత్వం రూపుదిద్దుకున్నప్పుడల్లా కవికి మరోజన్మ ఎత్తినట్టుంటుందని ప్రసిద్ధ కవయిత్రి శైలజామిత్ర అన్నారు. కవిత్వం కవిలో ఎప్పటికీ తరగని అసిధారా ప్రవాహమంటూ జన్మించడమే కవిత్వం అన్న కవితలో ఆమె రాశారు. సరిగ్గా అదే పేరుతో 61 కవితలతో ఆమె కవితా సంపుటి వెలువడిరది. నేనేం రాయలేనని అనుకుంటే/  అలా అనుకోవడం నుండే…

బిఆర్‌ఎస్‌ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తున్నదా ?

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన భారత రాష్ట్రసమితి తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వొచ్చింది. రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో ఒక్క స్థానంలోకూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిందంటే ఆ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నది స్పష్టమవుతున్నది.  ప్రతిపక్ష పార్టీలు  మొదటినుండీ ఈసారి బిఆర్‌ఎస్‌కు ఒక్క స్థానంకూడా రాదన్నట్లుగానే ఫలితాలు వెల్లడైనాయి. మెదక్‌ నియోజకవర్గం…

జార్జి రెక్కవిప్పిన రెవల్యూషన్‌..!!

అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు విస్తున్న కాలం ! లాటిన్‌ అమెరికా జాతీయోద్యమాలజి అగ్ని పర్వతాలు వెగజల్లే లావావేడి గాలులు..! హిమగిరిరులను మరి గిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న రaంరaూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్నోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం…