శరథీ!

దాశరధీ రాక్షస రాజ్య వ్యతిరేక శరపరంపర శరధీ రజాకార్ల ఇనుప బూట్ల ఘట్టనపై తూటాల రవళీ సమరమే నినాదమైన అద్భుత కావ్య ఖడ్గసృష్టీ జైలుగోడలపైనా నినదించిన తెలగాణ పౌరుష నాడీ నిరంతరం నిజాము ముసలి నక్కపై ప్రశ్నల కేళీ తిమిరంపై సమరంతో సమత్వ భావ పరివ్యాప్త ప్రచండ భేరి నిద్రాణ తెలగాణలో “రుద్రవీణ” మోగించి “అగ్నిధార”లు…








