Category శీర్షికలు

ఏ గణితాలూ పని చేయవు

LGBTQIA + సముదాయాలుగా మామీద జరిగిన శ్రమదోపిడీ, మాన,  ప్రాణహానికి ఈ సమాజం దగ్గర సాక్ష్యాలు, సంఖ్యలు లేవు, ఏ గణితాలు పనిచేయవు. అందుకే మా గురించి రాయటానికి  సమయమే కాదు సాహసం కూడా మా సముదాయం చేయలేదు. ఇప్పటిదాకా వొచ్చిన రచనలు మా సముదాయం నాయకుల, వారి జీవితప్రయాణాలను మా సముదాయానికి జరిగిన సంస్థాగతమయిన…

అహంభావ సాహిత్యం

(అహ్మద్‌నగర్‌ జైలు నిర్బంధంలో ఉన్నపుడు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ తన మిత్రుడు సదర్‌యార్‌ జంగ్‌ నవాబ్‌కు రాసిన లేఖ) అనువాదం : దేవులపల్లి మదన్‌ మోహన్‌ రావు -సేకరణ : వీణ మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ అహ్మద్‌ నగర్‌ కోట 1943, జనవరి 9 ప్రియ మిత్రమా! అహంభావ సాహిత్యాన్ని (జుస్త్రశీఱర్‌ఱష ూఱ్‌వతీa్‌బతీవ)…

చేతిలో ఎర్రజెండాను ఒడిసి పట్టుకొని

దిగువ మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టినప్పటికీ, పేదల ఆకలి కడుపుల కేకలు బాగా విన్నవారు. సమాజంలోని అజ్ఞానాన్ని, అశాస్త్రీయతను తొలగించాలని కొన్ని దశాబ్దాలుగా తన ఆలోచనలతో, అక్షరాలతో అనునిత్యం పోరాటం చేస్తున్నవారు. అన్నింటికీ మించి శ్రామికులు, కార్మికులు, కర్షకులు, చిరుద్యోగులకి ఆప్తులు పతివాడ నాస్తిక్‌. సమసమాజం కోసం ఆయన కంటున్న కలలు, కోరుకున్న మార్పు ఆయన కవిత్వం…

జయ్య్‌!

‘భారత్‌ మాతాకీ జయ్య్‌!’ పెద్దగా అరిచాడు. అలా అరిచినప్పుడు అతని కంఠనాళాలే కాదు, కంఠం కూడా వుబ్బింది. కళ్ళు యెర్రబడ్డాయి. కరుచుకున్న పల్లు టకటకలాడాయి. ముఖమయితే బాగా పిడిచి ఆరబెట్టిన బట్టలా యెక్కడికక్కడ వుగ్గులు పడిరది. రోడ్డుమీద గుడ్డలు చించుకున్న అతణ్ణి చూసి ‘దేశభక్తుడు’ అన్నారు కొందరు. ‘తెలంగాణ మాతాకీ జయ్య్‌!’ మళ్ళీ అరిచాడు. పిడికిలి…

ఒక నువ్వు

పొద్దున వాకిట్లో పువ్వు తెల్లగా నవ్వితే నువు గుర్తొస్తావు తలుపు తీసినప్పుడు అదాటున పిల్లతెమ్మెర తోసుకొస్తే నువు గుర్తొస్తావు అమ్మ భుజం మీద వెనుతిరిగి పాప చేతులూపినపుడు నువు గుర్తొస్తావు వానాకాలం చినుకుల్లో వెచ్చని అరచేతుల తేనీటి ఆవిరుల మధ్య నువ్వు గుర్తొస్తావు ఎవరూ లేని రోడ్డు మీద ఒక్కణ్ణీ నడచి వెళుతున్నప్పుడు నువు గుర్తొస్తావు…

కొత్తాకులు తొడిగి

రేపో ఎల్లుండో లేదా మరికొన్ని స్వల్పకాలపు దినాల్లోనో మన ప్రయాణం ముగిసిపోవచ్చు కానీ మన దారిలోని గాలిపాట చెట్ల సంగీతం నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి మన జ్ఞాపకాలు అంతే ప్రయాణపు హడావిడిలో వేగిరపు జీవితం దారిలో ఎన్నెన్నిటినో చూడకుండానే జీవితంలోకి ఒంపుకోకుండానే వదిలేసామో కదా తొలి జోరువానకే పరుగులు పెడుతున్న జీడివాగును చూశావా అడుగులేయడం నేర్చుకున్న…

‘నవరత్న పాకెట్ లా నడిచిపోయాడు’

రెడ్డి రామకృష్ణ కవిత్వం అంటే అర్థంకాని గందరగోళం అనుకునే కాలం దాదాపుగా గతించిపోయింది. సున్నితమైన అంశాలను కూడా స్పృశిస్తూ గొప్ప భావుకతతో చెప్పగలుగుతున్నారునేటి కవులు. కొందరు కొన్నికొన్ని కవితల్లో తేలిపోతున్నా కొన్నికొన్ని కవితలు బాగా రాస్తున్నారు. కొంతమంది మాత్రం అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. మంచి కవిత్వాన్ని సరళమైనభాషలోనే వ్యక్తీకరిస్తున్నారు. అలాంటి మంచికవిత్వం రాస్తున్న వారిలో మొయిద…

మెరుపు తీగెలు కాన!

బమ్మిడి జగదీశ్వరరావు నేనూ మా పాపా యానిమల్ ప్లానెట్‌ చూస్తున్నాం. సింహం వొకటి లేడిని వెంటాడుతోంది. ఆ లేడిపిల్ల చెంగుచెంగున దూకి పరుగులు తీస్తోంది. క్షణాల్లో దొరుకేస్తోంది అనేలోపు వెంట్రుకవాసిలో తప్పించుకొని పరుగులు తీస్తోంది. ఊపిరి బిగబట్టి చూస్తున్న మా పాపని గమనించి వీడియోని పాజ్ చేశాను. తను నా ముఖంలోకి చూసింది. ‘ప్చ్’ విచారించింది.…

వాయులీనం

వీరేశ్వరరావు మూల నాన్న చెప్పిన కధే మళ్లీ చెప్తాడు నాకు ఒక రాత్రి తెలిసిపోతుంది నాన్న దగ్గర కథలు లేవని వ్యధలు మిగిలాయని నాన్నేది దాచుకోడు నాన్న చొక్కాకి జేబు అందుకే లేదేమో నాన్న కన్నీళ్లు కడుపులోకి పోతాయేమో దాహం కూడా వెయ్యదంటాడు నాన్న దగ్గర ఏదో మంత్ర దండం ఉంది అందుకే అన్ని వేళల…