దాక్షిణాత్య ఉద్యమం అనివార్యం

మధ్య , దక్షిణ ద్రావిడ భాషాకుటుంబానికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషలు స్థూలంగా మాట్లాడే నైసర్గికప్రాంతమంతా అనేక మౌలిక సంక్షోభాలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. భారత రాజ్యాంగంలోని ఫెడరల్ కూర్పును పూర్తిగా మాయం చేస్తూ ‘కేంద్రస్వామ్యం’ ఏర్పాటు యత్నాలతో ద్రావిడ రాష్ట్రాల రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం అవుతోంది. దక్షిణాది కుత్తుకపై వేలాడుతున్న నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ మరో ప్రమాదం. దేశ సమైక్యత పేరిట…








