– వంద హై-రిస్క్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు విజయవంతం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10: అత్యంత తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించడంలో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ ఒక కీలక మైలురాయిని నమోదు చేసింది. గత ఐదున్నరేళ్లలో బాడీ మాస్ ఇండెక్స్ 60 కంటే ఎక్కువగా ఉన్న సూపర్-సూపర్ ఊబకాయం రోగులపై 100 . ఇటీవల 165 కిలోల బరువు, 63 బీఎంఐ కలిగిన 23 ఏళ్ల యువతికి శస్త్రచికిత్స నిర్వహించడంతో ఈ మైలురాయిని చేరుకుంది. ఈ శస్త్రచికిత్సను కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లో జనరల్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డా. వేణుగోపాల్ పరేక్ నేతృత్వంలో నిర్వహించారు. సాధారణంగా అన్ని రకాల ఊబకాయం రోగులకు బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. అయితే కేర్ హాస్పిటల్స్‌లో పూర్తయిన ఈ 100 శస్త్రచికిత్సలు పూర్తిగా బిఎంఐ 60కు పైగా ఉన్న సూపర్-సూపర్ ఊబకాయం రోగులకే నిర్వహించబడడం విశేషం. వైద్యపరంగా ఇవి అత్యంత క్లిష్టమైన, అధిక ప్రమాదం కలిగిన కేసులుగా పరిగణించబడతాయి. ఇలాంటి రోగులు తీవ్రమైన కదలికల సమస్యలు, అదుపులో లేని మధుమేహం, అధిక రక్తపోటు, నిద్రలో శ్వాస ఆడకపోవడం (స్లీప్ అప్నియా), ఫ్యాటీ లివర్, సంతానలేమి, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. శస్త్రచికిత్స సమయంలోనూ ప్రమాదాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లలో బిఎంఐ 80 వరకు ఉన్న అత్యంత క్లిష్టమైన కేసులను కూడా కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. ఇలాంటి రోగుల చికిత్సకు ప్రత్యేక శస్త్రచికిత్స నైపుణ్యం, బహుళ విభాగాల వైద్యుల సమన్వయం, అధునాతన అనస్థీషియా నిర్వహణ, శస్త్రచికిత్స అనంతర ప్రత్యేక పర్యవేక్షణ అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డా. వేణుగోపాల్ పరేక్ మాట్లాడుతూ, సూపర్-సూపర్ ఊబకాయం రోగుల్లో 100 బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేయడం ఒక ముఖ్యమైన మైలురాయని అన్నారు. ఇది మొత్తం శస్త్రచికిత్సల సంఖ్య కాదని, అత్యంత ప్రమాదకరమైన ఊబకాయం విభాగానికి చెందిన 100 మంది రోగులకు విజయవంతంగా చికిత్స అందించడమే ఈ ఘనత అని పేర్కొన్నారు. 100వ రోగి కేవలం 23 ఏళ్ల యువతి కావడం దేశంలో యువతలో తీవ్రమైన ఊబకాయం వేగంగా పెరుగుతోందనడానికి నిదర్శనమని చెప్పారు. పదేళ్ల క్రితం బేరియాట్రిక్ శస్త్రచికిత్స కోసం వచ్చే రోగుల్లో ఎక్కువమంది 40-50 ఏళ్ల వయసు వారే ఉండేవారని, ప్రస్తుతం 20-30 ఏళ్ల వయసులోనే తీవ్రమైన గ్రేడ్-3 ఊబకాయం, దానికి సంబంధించిన ఇతర వ్యాధులతో బాధపడుతున్న యువత సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఊబకాయం దీర్ఘకాలిక వ్యాధి అని, దీనికి సరైన చికిత్స అవసరమని డా. పరేక్ తెలిపారు. బేరియాట్రిక్ శస్త్రచికిత్స కేవలం బరువు తగ్గించడానికే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు, స్లీప్ అప్నియా, ఫ్యాటీ లివర్, సంతానలేమి, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ జోషి మాట్లాడుతూ, సూపర్-సూపర్ ఊబకాయం రోగుల్లో 100 హై-రిస్క్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేయడం సంస్థ నైపుణ్యానికి నిదర్శనమన్నారు. తీవ్రమైన ఊబకాయం యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో అవగాహన, ముందస్తు గుర్తింపు, ప్రత్యేక చికిత్స సేవలు మరింత అవసరమని పేర్కొన్నారు. ఈ రోగుల్లో ఎక్కువ మందికి అత్యాధునిక లాపరోస్కోపిక్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీటి వల్ల తక్కువ నొప్పి, వేగంగా కోలుకోవడం, దీర్ఘకాలికంగా మెరుగైన ఆరోగ్య ఫలితాలు లభిస్తున్నాయని వైద్యులు తెలిపారు. తీవ్రమైన ఊబకాయం చికిత్సలో కేర్ హాస్పిటల్స్ అగ్రగామిగా నిలుస్తూ, రోగులు తిరిగి సాధారణ జీవనశైలికి చేరుకునేలా సహకరిస్తోందని పేర్కొన్నారు.
————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





