హైడ్రా ఉద్యోగాల‌కు పోటెత్తిన యువత

– 150 డ్రైవర్ పోస్టులకు వేలాదిమంది పోటీ
– తెల్లవారుజామున 4 గంటల నుంచే అభ్యర్థుల బారులు
– సరూర్ నగర్ స్టేడియంలో కిక్కిరిసిన నిరుద్యోగులు
– తోపులాటతో రంగంలోకి దిగిన పోలీసులు
– టోకెన్లు ఇచ్చి అభ్యర్థులను వెనక్కి పంపిన అధికారులు

హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8:
నగరంలోని సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యో గులు పోటెత్తారు. శనివారం, ఆదివారం డ్రైవర్ల ఎంపిక ఉంటుందని హైడ్రా ప్రకటించింది. దీంతో ఇందులో పాల్గొనేందుకు నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగింది. డ్రైవర్ పోస్టుల కోసం రాష్ట్రంలోని నలుమూల నుంచి వేలాదిమంది నిరుద్యోగ యువత శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే సరూర్ నగర్ స్టేడియానికి భారీగా చేరుకున్నారు. ఊహించని రీతిలో వేలాదిమంది పోటెత్తడంతో స్టేడియం మొత్తం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత. తోపులాట చోటుచేసుకుంది. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నప్పటికీ అధికారుల వైపు నుంచి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి మంచి నీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో లైన్లలో వేచి ఉన్న యువత.. నిర్వా హకుల తీరుపై ఆందోళనకు దిగారు. ఉద్యోగం కోసం జిల్లాలు దాటి వస్తే అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారంటూ నిరుద్యో గులు వాపోతున్నారు. వెంటనే స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులకు టోకెన్ ఇచ్చి వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. టోకెన్ లో చెప్పిన టైమ్ ప్రకారం అక్కడకు వచ్చి ఈవెంట్స్ లో పాల్గొనాలని నిర్వాహకులు చెబుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *