– ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సిబ్బంది సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన ‘సురుచి’ స్టాఫ్ క్యాంటీన్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. పోలీసు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్‌ను అత్యాధునిక వసతులతో నిర్మించారు. అధికారులతో కలిసి క్యాంటీన్ ప్రాంగణాన్ని, సిబ్బందికి కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ మహేష్ ఎం.భగవత్, టీఎసఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు, సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్, వెల్ఫేర్ ఐజీపీ గజరావు భూపాల్, రైల్వే ఐజీపీ రమేష్ నాయుడు, టీజీ పిక్స్ చీఫ్ ఇంజనీర్ డి.తులసీధర్ రెడ్డి, వెల్ఫేర్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డితోపాటు పలువురు పోలీసు అధికారులు, డీజీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





