దేశ ప్రయోజనాలు అమెరికాకు బీజేపీ తాకట్టు

– ‘ట్రేడ్ డీల్‌’కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నిరసన
– కేంద్రంపై మంత్రి సీతక్క విమర్శల దాడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని, దేశ ప్రతిష్టను మసకబారుస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివ ద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. ఇండోIఅమెరికన్ ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా ఇందిరా పార్కులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ అమెరికాకు ప్రణమిల్లుతూ పీకల్లోతు కష్టాల్లో బీజేపీ ప్రభుత్వం కురుకుపోయిందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు మహిళా రిజర్వేషన్ డ్రామా ఆడుతున్నదని, మహిళా రిజర్వేషన్ల ముసుగులో డి లిమిటేషన్ బిల్లు తెచ్చిందని ఆరోపించారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదించిందని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ రెండేళ్ల క్రితం 106వ రాజ్యాంగ సవరణ జరిగిందంటూ దానికి అనుగుణంగా తక్షణం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మీరు పన్నెండేళ్లుగా అధికారంలో ఉండి మూడు రోజుల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ముగించాలని ఎందుకు హడావుడి పడుతున్నారు అని నిలదీశారు. బీజేపీకిì చేతకాక తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి మీదకు కార్యకర్తలను పంపిస్తున్నారని ఆమె విమర్శించారు. బీజేపీకిì చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి షరతులు లేకుండా, డిలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా మహిళా బిల్లును తీసుకురండి అని డిమాండ్ చేశారు. మహిళా ప్రధానిని రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్‌దని, బీజేపీ ఇప్పటివరకు ఒక్క మహిళకు కూడా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై విషం చిమ్మిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. బీజేపీ వైఫల్యాన్ని, రాజకీయ కుట్రలను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశం కోసం మహాహాత్మా గాంధీ. ఇందిరాగాంధీ. రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారని, 17 ఏళ్లపాటు నెహ్రూ జైలు జీవితం అనుభవించారని చెప్పారు. దేశ స్వాతంత్ర చరిత్రలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ ఈరోజు జాతీయవాదం మీద నీతులు చెబుతోందని విమర్శించారు. కాంగ్రెస్ సామాన్యుల పార్టీ.. మహిళల పార్టీ.. కాంగ్రెస్ పార్టీ కీర్తిని. ప్రతిష్టను గ్రామగ్రామాన చాటాలి అని కార్యకర్తలకు మంత్రి సీతక్క ఉద్బోధించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *