– భువనగిరి ఎంపీ చామల
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 7: సోషల్ మీడియాలో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టలేరని బీఆర్‌ఎస్ నేతలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వరుస ఓటములపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై జరుగుతున్న ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రచారంపై ప్రతి కాంగ్రెస్ నేతకు బాధ్యత ఉందని అన్నారు. జిల్లా, మండల స్థాయిలో స్పోక్స్ పర్సన్లను నియమిస్తామని తెలిపారు. మండల అధ్యక్షులు వారానికి ఓసారి ప్రెస్ మీట్ పెట్టాలని వారిని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





