రాష్ట్రంలో మండుతున్న ఎండలు

– పలుచోట్ల 42 డిగ్రీలకుపైగా నమోదు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. దాంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో వివిధచోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌తోపాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ మంగళవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో, బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం నుంచి ఎండలు మరింత ఠారెత్తించే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు బయటకు రావద్దని సూచించింది.

బయటకు రావద్దు :  ప్రజలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి
రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. కొద్ది రోజులుగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడాన్ని గమనిస్తున్నాం.. తీవ్రమైన ఎండలు ఉంటున్న సందర్భంలో ప్రజలు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని పంచాయతీరాజ్, గ్రామీణాభివ ద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. ఎండ అధికంగా ఉండే సమయాలు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావద్దని సూచించారు. ప్రజలందరూ  తమ పనులను ఉదయం 6 నుండి 10 గంటల వరకు ముగించుకుని ఇంటివద్దే ఉండడం శ్రేయస్కరమన్నారు. తప్పని పరిస్థితుల్లో బయ{కు వచ్చినట్లయితే టోపీ, లేదా టవల్, లేదా మరేదైనా వస్త్రాలు ఉపయోగించడం అవసరం, సురక్షితం కూడా అని మంత్రి సీతక్క అన్నారు. ఈ జాగ్రత్తలు తీసు¿కపోÃతే ఎండదెబ్బ (సన్‌స్ట్రోక్)కు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. చాలామంది ఎండదెబ్బ తగిలి అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. ఇటీవల గ్రామాలలో పర్యటించినప్పుడు ఈ విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఎండదెబ్బకు ఎవరూ గురికాకూడదని, అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా పంచాయతీరాజ్ శాఖ నుండి మేజర్ గ్రామ పంచాయతీలలో, మండల కేంద్రాలలో తక్షణం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయత్‌రాజ్ కమిషనర్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటించాలి
ఉపాధి హామీ పనులు ఎండా కాలంలోనే ఎక్కువ జరుగుతాయని, పెద్ద ఎత్తున పాల్గొంటున్నారుని మంత్రి సీతక్క తెలిపారు. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎండ సమయంలో పని చేయవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తలకు తలపాగా ధరించండి అని సూచించారు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలలో మంచినీటి ఏర్పాటు చేయమని ఆదేశించామన్నారు. ఉపాధి హామీ కూలీలకు ఫోటోలు తీసే విషయంలో కొంత బాధ ఉందని, అది అమలు చేయాల్సిన తప్పని పరిస్థితి ఉందని అన్నారు. మీ ఆరోగ్యాలు ముఖ్యం.. అందువల్ల ఎండలు తీవ్రంగా ఉన్నపుడు పనిలో ఉండకండి. ఒకవేళ అరగంట లేదా గంట సమయం ఎండలో పనిచేయాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోండి.. అందుబాటులో మంచి నీళ్లు ఉంచుకోండి అని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
——————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *