దేశానికి గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లు

– బలమైన దేశంగా ఎదగడానికి బాబా సాహెబ్ క షి
– తెలంగాణలో దళితుల అభ్యున్నతికి పెద్ద పీట
– దళిత బిడ్డలు ఉన్నత పదవుల్లో ఉంటే ఓర్వలేకపోతున్నారు
– డీ లిమిటేషన్‌తో తెలంగాణకు తీరని అన్యాయం
– అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : దేశానికి మహాత్మా గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లలాంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశాభివ ద్ధిలో అంబేడ్కర్ పాత్ర అంతే ఉందన్నారు. లోయర్ ట్యాంక్ బండ్‌లో మంగళవారం నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ రక్తం చిందకుండా యుద్ధం గెలవవచ్చని గాంధీ నిరూపించారని, బలమైన దేశంగా భారత్ ఎదగడానికి అంబేడ్కర్ క షి చేశారని చెప్పారు. ప్రజల కలలు సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం క షి చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో దళిత, గిరిజనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారంటూ విమర్శించారు. గతంలో భట్టి విక్రమార్కకు సీఎల్పీ నేత హోదాను తొలగించేలా కుట్రలు జరిగాయని సీఎం రేవంత్ ఆరోపించారు. దళిత బిడ్డ స్పీకర్‌గా ఉన్నారని అసెంబ్లీకి రాకుండా ఆయన్ని అవమానిస్తున్నారంటూ దళిత బిడ్డలు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండొద్దా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడితే ఓర్వలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. గతంలో చేసిన అప్ప్పులు, తప్ప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. పదేళ్ల విధ్వంసం.. వందేళ్ల నష్టానికి దారి తీసిందని సీఎం అన్నారు.

మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్‌పై గందరగోళం

మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై కేంద్రం గందరగోళం స ష్టిస్తోందని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర బీజేపీ చేస్తున్నదని ఆరోపించారు. 50 శాతం ప్రాతిపదికన పెంచుతామని దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తున్నారని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ చిన్న లెక్క కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళకి తెలియడం లేదా అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాదిన కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గి సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొందని, కేంద్రం ఆదేశాలు పాటించి జనాభా నియంత్రణ పాటిస్తే నష్టం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు తీరని నష్టంపై అభ్యంతరం లేవనెత్తామని సీఎం తెలిపారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 50 శాతం జనాభా ఆధారంగా.. మరో 50 శాతం జీఎస్‌డీపీ ఆధారంగా హైబ్రిడ్ మోడల్‌లో డీ లిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించిందని, కానీ లోక్‌సభలో కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివ ద్ధి పథంలో నడపవచ్చని అంబేడ్కర్ మార్గదర్శనం చేశారన్నారు.

విద్య ఒక్కటే జీవితాలను మారుస్తుంది

విద్య ఒక్కటే మన జీవితాలని మారుస్తుందని అంబేద్కర్ నమ్మారని సీఎం తెలిపారు. అంబేద్కర్ ఆలోచనే ప్రజా పాలన విధానం ఆర్టికల్ 3 ద్వారానే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారంటూ ఉద్యమంలో బడుగు, బలహీనవర్గాలే ముఖ్య పాత్ర పోషించారన్నారు. పాటతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన గద్దరన్న పాత్రను మరిచిపోతారని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమేనని, జయ జయహే తెలంగాణ గీతాన్ని రాసిన అందెశ్రీ మనవాడు కాదా అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని, కులాల అంతరం తొలగిపోవాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, నాణ్యమైన విద్య అందించాలన్న ఆశయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకొస్తున్నామని వివరించారు. రెండేళ్లల్లో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం.. ఇందులో ఎక్కువ దళితులు, గిరిజనులకు ఇచ్చింది వాస్తవం కాదా మీరే ఆలోచించండి అని అన్నారు. 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు లభించాయి.. మేం నిరంతరం పనిచేస్తుంటే వెనక నుంచి కొందరు కుట్రలు చేసి, గోతులు తవ్వుతున్నారని ఆరోపించారు. గోతులు తవ్వే వారిని ఆ గోతిలోనే పాతిపెట్టే పని మీరు చేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. పదేళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ మేం ముందుకు వెళుతున్నామన్నారు. గత పదేళ్లలో పెద్దపెద్ద ప్రసంగాలు చేసిన నాయకులు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారా ఆలోచించండి అని అన్నారు. మంచి పనికి మా ప్రభుత్వం ముందుంటుంది ఈ ప్రభుత్వం మీది.. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీది అని ప్రsజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *