– రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్రం
– నిందితులను శిక్షించకుండా విద్యార్థులపై దాడులా?
– కేటీఆర్ బినామీ సంస్థపై బీజేపీకి ఎందుకంత ప్రేమ?
– నరేంద్ర, ధర్మేంద్ర దేశాన్ని దోచుకుంటున్నారు
– కొడంగల్ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– నిందితులను శిక్షించకుండా విద్యార్థులపై దాడులా?
– కేటీఆర్ బినామీ సంస్థపై బీజేపీకి ఎందుకంత ప్రేమ?
– నరేంద్ర, ధర్మేంద్ర దేశాన్ని దోచుకుంటున్నారు
– కొడంగల్ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 22 : ‘నీట్’ పేపర్ లీక్‌పై పోరాటం చేస్తున్న విద్యార్థులకు మద్ధతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పట్లౖ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే పాశవిక దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల పాశవిక దాడులపై కొడంగల్‌లో ముఖ్యమంత్రి నాయకత్వంలో బుధవారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ‘నీట్’ పేపర్ లీక్‌తో బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని సీఎం విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను అమ్ముకుని ఆ పార్టీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, ‘నీట్’ పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సిందిపోయి జంతర్‌మంతర్ వద్ద శాంతియుత నిరసన తెలిపిన విద్యార్థులపై పాశవికంగా దాడి జరుపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండా పోయారన్నారు. విద్యార్థులకు మద్దతుగా రాహుల్, ప్రియాంకలు ప్రధాని ఇంటి ముందు నిరసన చేపట్టారని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పాశవికంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. పాశవిక దాడితో రాహుల్ గాంధీ రక్తం చిందిందంటూ దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని చెప్పారు. ఆంగ్లేయులతో పోరాడి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. బాంబు దాడితో శరీరం ముక్కలైనా దేశ సమైక్యత కోసం ప్రాణాలిచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా సోనియా గాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని, కనీసం మంత్రి పదవి కూడా తీసుకోలేదని తెలిపారు. మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేసి త్యాగనిరతిని చాటుకున్న గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గేను నియమించారు తప్ప పదవులు తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రజా స్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగంలో కల్పించిన హక్కు అన్నారు. పేపర్ లీక్‌పై పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రధాని అడ్డుకున్నారని విమర్శించారు.
దేశాన్ని దోచుకుంటున్న నరేంద్ర, ధర్మేంద్ర 

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 2019లో ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకలకు పాల్పడిందని గుర్తు చేశారు. ఆ సంస్థ 27 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నదన్నారు. అనుభవం, అర్హత లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లతో ఆనాడు కేటీఆర్ తన బినామీ సంస్థ గ్లోబరీనాకు ప్రాజెక్టును అప్పగించారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పప్పులు ఉడకవని ఆ సంస్థ కోయెంప్ట్ ఎడ్యుకేషన్‌గా పేరు మార్చుకుని సంస్థ కేంద్రం వద్దకు వెళ్లిందని తెలిపారు. దిల్లీ బీజేపీ వాళ్లతో మాట్లాడుకుని వాళ్లకు కేటీఆర్ కాంట్రాక్టు ఇప్పించారని, ‘నీట’ నిర్వహించడంతో వాళ్లకు దొంగతనం చేయొచ్చన్న ధైర్యం వచ్చిందని ఆరోపించారు. సీబీఎసఈలో అక్రమాలు, ‘నీట్’ పేపర్ లీకేజ్‌పై విద్యార్థులు నిరసన తెలిపారన్నారు. విద్యార్థులు, యువత పక్షాన నిలిచి మోదీపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ
రాహుల్, ప్రియాంకలతోపాటు విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్‌లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఉదయం తన నివాసంలో ఎసఐఆర్‌పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరారు. రాహుల్ గాంధీపై జరిగిన దాడి చిత్రాలతో కూడిన బ్యానర్‌తో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకలుతో కలిసి కాలినడకన అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





