– బ్రిక్స్ సమావేశాలకు శాసనసభాపతి ప్రసాద్ కుమార్ హాజరు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : దిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో 26, 27 తేదీలలో జరుగుతున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశాలకు హాజరయ్యేందుకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఆయన మాట్లాడుతూ బ్రిక్స్ సమావేశాల వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశాల్లో వివరిస్తామని చెప్పారు. అలాగే అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. స్పీకర్ పర్యటన విజయవంతం కావాలని పలువురు ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





