భారత గండక్ నదిలోకి నేపాల్ వరదల మృతదేహాలు

ఖట్మండు, ఆగస్ట్ 28 : నేపాల్ వరదల్లో వం దల మంది చనిపోయారు. వారి మృతదేహాల ను సహాయక సిబ్బంది వెలికితీస్తున్నారు. భారతదేశంతో సరిహద్దు పంచుకునే నేపా ల్లోని చిత్వాన్ జిల్లాలో అత్యధికంగా 132 మృతదేహాలు లభ్యమ య్యాయి. భారత్లోని ఉత్తరప్రదేశ్లోని మహరాజ్గంజ్ వద్ద గండ క్ నదిలో మూడు మృతదేహాలను వెలికితీశా రు. భారత సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా ఐల్ వీటిని గుర్తించి మోటార్ బోట్ల సహాయంతో వెలికితీశారు. ఈ మృతదేహాల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడివి ఉన్నాయ ని ఎస్ఎసీబీ ఇన్స్పెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. వారి వివరాలు ఇంకా తెలియ లే దు. ఇవి అక్కడి మృతదేహాలే అయితే సుమా రు 200 కిలోమీటర్ల దూరం కొట్టుకొ చ్చాయని భావిస్తున్నారు. నేపాల్లో హిమపాతం, భారీ వర్షాల వల్ల నా రాయణి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అక్కడి భోటెకోశి, త్రిశూలి నదులు కలిసి నారాయణి నదిగా మారుతాయి. దీన్నే కాళీ గండకీ అని కూడా పి లుస్తారు. ఈ నది భారత్ లోకి ప్రవహిస్తుంది. దీన్ని ఇక్కడ గండక్ అని పిలు స్తారు. ఇది భారత్ లోని ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల గుండా ప్రవహించి పట్నా సమీపంలోని హాజీపూర్-సోనేపూర్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. నేపాల్ వరదల కారణంగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్ నది పరీవాహక ప్రాంతాల్లోని పలు లోతట్టు  గ్రామాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నేపాల్ నుంచి 21మంది భారత్ చేరిక : విదేశాంగశాఖ ప్రతినిధి జైశ్వాల్ 

న్యూదిల్లీ : నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 21 మంది భారతీయులు సురక్షితంగా దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా వారి స్వస్థలం తమిళనాడు చేరుకున్నారని వివరించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. నేపాల్లోని త్రిశూలి హైడ్రో పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న 63 మంది భార తీయులను కూడా రక్షించారని తెలిపారు. అయితే నేపాల్ వరదలకు 320 మంది భారతీయులు, 100 మంది ఎన్నారైలు గల్లంత య్యారని చెప్పారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వీరంతా గల్లంతయ్యారని పేర్కొన్నారు. అయితే చైనా వైపు టిబేట్లో 400 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని అన్నారు. వారందరితో భారత రాయబార కార్యాలయం సంబంధాలు కలిగి ఉందని తెలిపారు. త్వరలో వారందరూ భారత్కు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *