బెంగాల్ ఎన్నికల్లో విజయం బీజేపీదే

-మొదటి దశలో 110కిపైగా సీట్లు గెలుస్తాం
– కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా

కోల్‌కతా, ఏప్రిల్ 24: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మొదటి దశ ఎన్నికల్లో 152 స్థానాలకు గాను బీజేపీ 110కి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన కోల్‌కతాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండో దశలోనూ తామే ఎక్కువ సీట్లు నెగ్గుతామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజీపీనే అంటూ ప్రకటించారు. మమతా బెనర్జీ, టీఎంసీ ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని అమిత్ షా జోస్యం చెప్పారు. అందుకు మొదటి దశలో 92.88 శాతం వోటింగ్ నమోదు కావడమే నిదర్శనమన్నారు. బెంగాల్ వోటర్లు అభివృద్ధిని ఎంచుకున్నారని తొలి దశ ఎన్నికలతో స్పష్టమైందని చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో మార్పు కోసం ప్రజలు ఉత్సాహంగా వోట్లు వేశారన్నారు. మహిళల రక్షణ బీజేపీ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అవినీతిపరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. బెంగాల్‌లో బీజీపీ, పార్టీ అభ్యర్థులు తమ అంచనాలకు తగినట్లుగా పనిచేశారని కితాబు ఇచ్చారు. మరోవైపు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా పోలింగ్ పక్రియను నిర్వహించారంటూ ఎన్నికల సంఘం, స్థానిక పోలీసులు, భద్రతా దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలాకాలం తర్వాత ఒక్కరి ప్రాణం కూడా పోకుండా జరిగిన బెంగాల్ ఎన్నికలు ఇవేనని అమిత్ షా పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *